- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీకేర్ కోల్డ్ స్టోరేజ్ లో ఐటి అధికారుల తనిఖీలు
దిశ, ఉండవెల్లి : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలలోని కోల్డ్ స్టోరేజీ లపై ఏకకాలంలో ఐటి అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఐటీ

దిశ, ఉండవెల్లి : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలలోని కోల్డ్ స్టోరేజీ లపై ఏకకాలంలో ఐటి అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఐటీ అధికారులు ప్రత్యేక వాహనాలలో కోల్డ్ స్టోరేజ్ దగ్గరకు చేరుకుని అక్కడ సిబ్బంది మొబైల్ ఫోన్లను తీసుకొని సెక్యూరిటీగా ఒక అధికారికి అప్పగించారు. అనంతరం అధికారులు కోల్డ్ స్టోరేజ్ సమీపంలో ఉన్న ఇతర వాహనాలలో కూడా సోదాలు చేశారు. కంపెనీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వారిని అక్కడి నుంచి పంపించారు. అనంతరం కోల్డ్ స్టోరేజ్ కార్యాలయాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే గోదాములలో నిలువ ఉన్న ధాన్యం బస్తాల స్టాక్ రిజిస్టర్లను, పంటల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
జీరో దందా చేస్తున్నట్లు సమాచారంతోనే దాడులు
గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వీకేర్ కంపెనీ రైతుల పేరుతో పంటలను కొనుగోలు చేసి స్టోరేజ్ జిల్లా దాచి ఉంచడంతోపాటు రైతుల పేరుతోనే క్రయవిక్రయాలు చేస్తూ జీవోదంతా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ తదంగం కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ఐటీ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచి మంగళవారం తనిఖీలు చేస్తున్నట్లు విశ్వనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా గార్గపురం, గుంటూరు జిల్లా లోని వీకేర్ కోల్డ్ స్టోరేజీలలో తనిఖీలు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.






