సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అధికారుల బృందం

by Bhanu |

సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1న మక్తల్ పర్యటనలో పాల్గొననున్న నేపథ్యంలో వేదిక, హెలికాప్టర్ ల్యాండింగ్, భద్రతా ఏర్పాట్లను అధికారులు గురువారం మధ్యాహ్నం పరిశీలించారు.

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అధికారుల బృందం
X

దిశ, మక్తల్ : సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1న మక్తల్ పర్యటనలో పాల్గొననున్న నేపథ్యంలో వేదిక, హెలికాప్టర్ ల్యాండింగ్, భద్రతా ఏర్పాట్లను అధికారులు గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీను, డీఎస్పీ నల్లపు లింగయ్య కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మొదటగా అనుకున్న గొల్లపల్లి గ్రామ శివారులోని వేదికను అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం మక్తల్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైదానాన్ని సభా వేదికగా నిర్ణయించారు. అక్కడ హెలిప్యాడ్, బందోబస్తు, పార్కింగ్, ప్రజల రాకపోకలు, భద్రతా అంశాలపై అధికారులు స్పష్టమైన దిశానిర్దేశాలు చేశారు. పరిశీలన కార్యక్రమంలో తహసిల్దార్ సతీష్ కుమార్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రామ్‌లాల్, ఎస్సైలు భాగ్యలక్ష్మి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రవికుమార్, పూజా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story