ఆవిష్కరణలు పాఠశాల నుంచే అవసరం

by Ratna Kumari |

విద్యార్థుల పాఠశాల చదువుల నుండే ఆవిష్కరణలు అవసరమని 'ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ఫెల్లో' సాగర్ హరిర మణి అన్నారు.

ఆవిష్కరణలు పాఠశాల నుంచే అవసరం
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : విద్యార్థుల పాఠశాల చదువుల నుండే ఆవిష్కరణలు అవసరమని 'ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ఫెల్లో' సాగర్ హరిర మణి అన్నారు. బుధవారం జెపీఎన్సీఈ కళాశాలలో విద్యా శాఖ ఇన్నోవేషన్ సెల్, పాఠశాల ఆవిష్కరణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఇన్నోవేషన్ డిజైన్ అండ్ ఎంటర్ప్రిన్యూర్షిప్' అంశంపై జరిగిన మూడు రోజుల సదస్సును ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి ప్రసంగించారు. ఈ శిక్షణ ద్వారా పాఠశాలలో ఆవిష్కరణ, డిజైన్ థింకింగ్, పారిశ్రామికతను ప్రోత్సాహించడం ముఖ్య ఉద్దేశ్యమని, మన ఆలోచనలు నూతన ఆవిష్కరణలకు దారి తీయాలని, వాటికి నాంది పలకాలని ఆయన అన్నారు. కళాశాల చైర్మెన్ కెఎస్ రవికుమార్ మాట్లాడుతూ, ఇలాంటి సదస్సుల ద్వారా విద్యార్థుల్లో నాలెడ్జ్ పెరిగి, కొత్త కొత్త ఆవిష్కరణల ఆలోచనలకు నాంది పలుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని 5 జిల్లాలు, వికారాబాద్ జిల్లా నుండి 170 మంది ప్రిన్సిపల్స్, విద్యార్థులు, శిక్షకులు డా.రాజేష్ కందుల, డా.అబ్రహం, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Next Story