- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జింకను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
by S Gopi |
ప్రస్తుత రోజుల్లో సరైన అటవీ ప్రాంతాలు లేక వన్య ప్రాణులు అంతరించి పోతున్నాయి. ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న... injured in road accident

X
దిశ, గద్వాల క్రైమ్: ప్రస్తుత రోజుల్లో సరైన అటవీ ప్రాంతాలు లేక వన్య ప్రాణులు అంతరించి పోతున్నాయి. ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న హరితహారం పేరుతో అడవులను సంరక్షించేందుకు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ పచ్చని చెట్లతో అటవీ ప్రాంతంగా కనిపిస్తుండటంతో ఎక్కడినుండో ఓ జింక జోగులాంబ గద్వాల జిల్లాకు వచ్చింది. గురువారం మధ్యాహ్నం గద్వాల పట్టణ సమీపంలో ఓ జింక గద్వాల - ఐజ రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో జింకకు స్వల్ప గాయాలు కాగా, అటుగా వెళుతున్న ప్రయాణికులు జింకను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో అటవీశాఖ అధికారులు జింకకు వైద్యం చేయించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జింకను అటవీ ప్రాంతంలో వదిలేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Next Story






