- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇల్లు బిల్లు రాక ఆగమాగం
దిశ, బిజిజేపల్లి : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కొంత మంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆదిలోనే అభాసుపాలవుతున్నది. ఇందిరమ్మ పథకంలో భాగంగా

దిశ, బిజిజేపల్లి : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కొంత మంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆదిలోనే అభాసుపాలవుతున్నది. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇల్లు మంజూరైందని సంబురంగా పాత ఇంటిని కూలగొట్టుగొని కొత్త ఇంటి నిర్మాణం రెండవ దశ పూర్తై బిల్లులు పడక పోగా, ఎలాంటి నిర్మాణం చేపట్టని లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బు జమైతున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, పోలేపల్లి గ్రామంలో మొల్గర పార్వతమ్మకు భర్త కృష్ణయ్య కు ఇందిరమ్మ ఇల్లు మంజురైంది. అదే క్రమంలో ఇంకో లబ్దిదారు మొల్గర పార్వతమ్మ భర్త కాశన్న పేరిట మంజూరైంది. అయితే ఈ లబ్దిదారుల్లో మొల్గర పార్వతమ్మ కృష్ణ అనే మహిళా బేస్ మెంట్ కట్టుకోనీ పంచాయతీ కార్యదర్శి సమాచారం ఇవ్వడంతో ఏఈ ఫోటోలు దింపుకొని వెళ్లారు. పంచాయితీ కార్యదర్శి నిర్వాకమో లేక పై అధికారి శర్వకమో కాని ఇంటి బేస్మెంట్ పూర్తి చేసిన లబ్దిదారుని మొదటి విడత, అదే ఇంటి పేరు ఉండి - అదే పేరున్నా మొల్గర పార్వతమ్మ భర్త కాశన్న అకౌంట్ లోకి జమ అయింది.
ఇద్దరి లబ్ది దారుల ఇంటి పేర్లు, పేరు ఒకటే అయినా భర్త పేరు మాత్రం వేరు. ఈ సంగతి మరచి పరిశీలన నిర్వహించిన అధికారులు పూర్తి స్థాయిలో విశ్లేషించకుండా ఒకరికి బదులుగా ఒకరి పేరును ఆన్లైన్ లో ఎంట్రి చేశారు. పంచాయతీ కార్యదర్శి, ఏఈ లు ఫోటోలు దింపుకొని నేటికి ఏడు నెలలు గడుస్తున్నా బిల్లు మాత్రం రావడం లేదని మొల్గర పార్వతమ్మ కృష్ణ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందిరమ్మ బిల్లు రాకపాయే అని పంచాయతీ కార్యదర్శిని చుట్టూ ప్రదక్షిణలు చేయడం, అదిగో వస్తది.. ఇదిగో వస్తది అని కాలయాపన చేస్తుందని మొరపెట్టుకుంటుంది. ప్రభుత్వం చెప్పిన మాటలతో ఉన్న ఫలంగా ఇంటిని కూలగొట్టి దాని అడుగులోనే ఇందిరమ్మ ఇల్లుకు ముగ్గులు పోసి 5రూ. వడ్డీతో బయట అప్పు తెచ్చుకొని బేస్మెంట్ వేయిస్తే 7 నెలలు గడుస్తున్నా బిల్లు రాకపోగా, తీసుకున్న అరువుకు మాత్రం వడ్డీ మాత్రం కట్టవలసిన దుస్థితి నెలకొందని లబ్దిదారులు వాపోతున్నారు. కాయ కష్టం చేసుకొని ఒక గూడు నిర్మించుకుందామంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల బిల్లులు రాక అప్పులుపాలు అయ్యే పరిస్థితి ఏర్పడ్డదని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, మొదటి విడత బిల్లు మంజూరు చేస్తే అప్పులు కట్టుకుంటామని మొల్గర పార్వతమ్మ కృష్ణ కోరుకుంటుంది.






