ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణకై నిరవధిక నిరహారదీక్ష

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : టీజీఆర్టీసీ లో ఈ నెల 31 లోపు యూనియన్ల ను పునరుద్ధరించకపోతే ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్

ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణకై నిరవధిక నిరహారదీక్ష
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : టీజీఆర్టీసీ లో ఈ నెల 31 లోపు యూనియన్ల ను పునరుద్ధరించకపోతే ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన ఎస్ డబ్ల్యూ యూ రాష్ట్ర నాయకులు సాయిరెడ్డి, అహ్మద్ ఖాన్ లు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో ఐఎన్టీయూసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ లో యూనియన్ లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా కూడా యూనియన్ లను పునరుద్ధరించక పోవడం అసంజసమని వారు విమర్శించారు. వెంటనే యూనియన్ లను పునరుద్ధరించి కార్మిక హక్కులను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.

Next Story