- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్యకర ప్రవర్తన
నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం ఎంపీహెచ్ఎస్ మోమినాపూర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం ఎంపీహెచ్ఎస్ మోమినాపూర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నారాయణపేట జిల్లాలో విద్యార్థి సంఘాల నాయకులు PDSU, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. తరగతి గదిలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వీడియో చూసి అందరూ చర్చించుకోవడం గమనార్హం. తల్లిదండ్రులు ఎంతో ఆశతో తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తుంటారు. సమాజంలో తల్లి, తండ్రి తర్వాత తరగతి గదిలోనే విద్యార్థుల జీవితాలను చెక్కే శిల్పిగా ఉపాధ్యాయిలను ఈ సమాజం గౌరవిస్తుంది. గురువుగా భావించే విద్యార్థుల పట్ల అసభ్య కరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మార్చి 07న రహస్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన పై ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ ఉన్నతాధికారులకు ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు పాఠశాలకు పంపాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి కీచక ఉపాధ్యాయుని విద్యాశాఖ సస్పెండ్ చేయడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగించి కఠినంగా శిక్షించాలని జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు విద్యావేత్తలు కోరుతున్నారు.






