- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి : సీపీఎం
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం వీపనగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.

దిశ, వీపనగండ్ల : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం వీపనగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి డి. బాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ధరల పెరుగుదలను నియంత్రిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రజలపై ఆర్థిక భారం మోపడం దురదృష్టకరమన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో ఇంధన ధరలు తగ్గించకపోవడం ప్రజలకు అన్యాయమని విమర్శించారు. ఎన్నికల అనంతరం మే 15 నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయని తెలిపారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం మరింత భారంగా మారిందన్నారు. కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కాకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు పనిచేయాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు సీ.హెచ్. వెంకటయ్య, నక్క ఈశ్వర్, ఎం.ఆది, వెంకటేశ్వర గౌడ్, వెంకన్న, రామకృష్ణ, నవీన్, రఘు పాల్గొన్నారు.






