- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ సవరణతోనే సాధ్యం : పెబ్బేటి వీరసాగర్
దిశ, పాన్ గల్ : రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ సవరణతోనే సాధ్యమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెబ్బేటి వీరసాగర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్ పేర్కొన్నారు.

దిశ, పాన్ గల్ : రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ సవరణతోనే సాధ్యమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెబ్బేటి వీరసాగర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో స్థానిక ఎన్నికలకు వెళ్తే అవి చెల్లడం లేదని కోర్టు తీర్పుద్వారా స్పష్టంగా అర్థమైందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లతో నాటకాలు ఆడిందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి హైకోర్టులో కేసు వేయడం వల్లనే కోర్టు స్టే ఇచ్చిందని మంత్రులు మాట్లాడటం చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు. అమలుకానీ 420 హామీలను ఇచ్చి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు తిలకేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మండల నాయకులు సుధాకర్ యాదవ్, రాజేశ్ రెడ్డి, దశరథ్ నాయుడు, దామోదర్ రెడ్డి, తిరుపతయ్య నాయుడు, నజీర్, యాదగిరి చారి, మాజీ సర్పంచ్ బాలస్వామి, రామచందర్, కృష్ణయ్య పాల్గొన్నారు.






