అకస్మాత్తుగా ఆగిన ప్రారంభోత్సవం

by Ratna Kumari |

దిశ, తాడూరు : మండల కేంద్రంలో అకస్మాత్తుగా డిజిటల్ గ్రంథాలయ శిలాఫలకం ప్రారంభానికి నోచుకోక వెక్కిరిస్తుందని పాఠకులు అంటున్నారు.

అకస్మాత్తుగా ఆగిన ప్రారంభోత్సవం
X

దిశ, తాడూరు : మండల కేంద్రంలో అకస్మాత్తుగా డిజిటల్ గ్రంథాలయ శిలాఫలకం ప్రారంభానికి నోచుకోక వెక్కిరిస్తుందని పాఠకులు అంటున్నారు. గత నెల 25 తారీకు సి ఎస్ ఆర్ నిధులనుండి డిజిటల్ గ్రంథాలయాన్ని నిర్మించడానికి మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ ఆవరణంలో శిలాఫలకాలు ఏర్పాటు చేసి భవన నిర్మాణానికి ముగ్గు పోశారు. ఏం జరిగిందో ఏమో కానీ ఎంపీడీవో ఆంజనేయులుతో పాటు అధికారులు అందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రారంభం కొరకు వేచి చూసి శిలాఫలకం ప్రారంభించకుండానే వెళ్ళిపోయారు. ఇప్పటివరకు వారం రోజులు గడుస్తున్నా వేసిన శిలాఫలకం ప్రారంభానికి నోచుకోక అదేవిధంగా ఉంది.

నిన్న, మొన్న కురిసిన వర్షాలకు వేసిన' ముగ్గు ' గీతలు చెరిగి పోయాయి. శిలాఫలకంపై' దిశ 'ఆరా తీయగా ఓ కాంగ్రెస్ నియంత నాయకుని కళ్ళల్లో ఆనందం చూడడానికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి మారుమూల ప్రాంతమైన గుట్టలపల్లి గ్రామానికి అకస్మాత్తుగా డిజిటల్ గ్రంథాలయ నిర్మాణాన్ని తరలించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. డిజిటల్ గ్రంథాలయాన్ని మారుమూల గ్రామానికి తరలించడంపై మండల ప్రజలు ఎంపీ మల్లు రవి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తే అన్ని గ్రామాల ప్రజలు, నిరుద్యోగులు చదువుకోడానికి వీలుగా ఉంటుందని అందరికీ ఉపయోగంగా ఉంటుందని మారుమూల ప్రాంతంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తే ఎవరికి ఉపయోగం లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎంపీ మల్లు రవి స్పందించి మండల కేంద్రంలో తిరిగియధా స్థానంలో గ్రంథాలయ నిర్మాణం ఏర్పాటు చేయాలని మండల వాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వారు తెలిపారు. ఎంపీడీవో ఆంజనేయులు ని 'దిశ' వివరణ కోరగా ఎంపీ మల్లు రవి అకస్మాత్తుగా శిలాఫలక ప్రారంభోత్సవాన్ని ఆపారని ఆయన తెలిపారు.

Next Story