- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేశిరెడ్డిపల్లిలో ‘సంధ్య బయోటెక్’ కర్మాగారానికి శ్రీకారం
దిశ, బచ్చన్నపేట : మండలంలోని కేశిరెడ్డిపల్లి గ్రామంలో “సంధ్య బయోటెక్ వ్యవసాయ ఉత్పత్తుల కర్మాగారం” ప్రారంభోత్సవానికి భూమి పూజ ఘనంగా నిర్వహించారు.

దిశ, బచ్చన్నపేట : మండలంలోని కేశిరెడ్డిపల్లి గ్రామంలో “సంధ్య బయోటెక్ వ్యవసాయ ఉత్పత్తుల కర్మాగారం” ప్రారంభోత్సవానికి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. యువ పారిశ్రామికవేత్త ఇమ్మడి హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యురాలు గంగ భవాని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగ భవాని రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో యువతకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని, స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి సారం తగ్గిపోతూ, పంటల నాణ్యత దెబ్బతింటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు అనుసరించడం ద్వారా రైతులకు అధిక లాభాలు, వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని వివరించారు. ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహించడం సమాజానికి ఆరోగ్య భద్రతను అందించే దిశగా ముఖ్యమైన అడుగని చెప్పారు. ఇమ్మడి హరీష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలోనే నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులు తయారు చేసి రైతులకు మంచి ధరలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, రైతుల ఆదాయం పెంపొందించడమే కర్మాగారం ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అభి గౌడ్, రాష్ట్ర కిసాన్ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ నిడికొండ శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పిన్నింటి నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ చింతల రాజు, నిమ్మ కరుణాకర్ రెడ్డి, మధు, వంచ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.






