- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కి తట్టెడు మట్టి తీయలేదు : ఎమ్మెల్సీ కవిత
దిశ, నాగర్ కర్నూల్ : పాలమూరు తన సొంత జిల్లా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి రెండేళ్లలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు తట్టెడు మట్టి కూడా తీయలేదని తెలంగాణ జాగృతి

దిశ, నాగర్ కర్నూల్ : పాలమూరు తన సొంత జిల్లా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తట్టెడు కి మట్టి కూడా తీయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ జన జాగృతి కార్యక్రమంలో భాగంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు. వట్టెం రిజర్వాయర్ పంప్ హౌస్ ను సందర్శించిన అనంతరం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మొన్న కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి కి రూ. 4300 కోట్లు ఇచ్చానని చెప్పారు. ఇస్తే రెండేళ్లలో తట్టేడు మట్టి కూడా ఎందుకు తీయలేదని విమర్శించారు. నారాయణపేట- కొండగల్ స్కీంకు 1000 కోట్లు, మెగా రెడ్డికి 1000 కోట్లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వెయ్యి కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని దుయ్యబట్టారు. నారాయణపేట కొండగల్ ప్రాజెక్టు ల్యాండ్ అక్యూషన్ మాత్రమే జరుగుతుందంటే రేవంత్ రెడ్డి ది కరప్షన్.. డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు.
పాలమూరు- రంగారెడ్డి ఫస్ట్ ప్రాజెక్టు ఎల్లూరు ఓపెన్ పంప్ హౌస్ ఎడ్జస్టింగ్ పంప్ హౌస్ కడితే కల్వకుర్తికి ఇబ్బంది అవుతుందని అది ఓపెన్ పంప్ హౌస్ కట్టారు. అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఆ కాంట్రాక్టు సంస్థతో కుమ్మక్కై దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేశారు. అది బ్లాస్టింగ్ చేయడంతో కల్వకుర్తిలో మూడో, ఐదో మోటార్ ఎగిరిపోయింది. అవి పని చేస్తలేవు. ఇప్పటికీ హరీష్ రావు నిర్వాకం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మూడే మోటర్లు పనిచేస్తున్నాయి. వట్టెం రిజర్వాయర్ లో నల్లమట్టి కోసం తీసుకున్న 900 ఎకరాలు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ కు సాగునీరు అందడం లేదనన్నారు. మెడికల్ కాలేజీకి భూములు ఇచ్చిన దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాగు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. నాగర్ కర్నూల్ కు ఇప్పటివరకు రైల్వే లైన్ రాలేదు. ఇప్పుడున్న ఎంపీ చొరవ తీసుకొని రైలు వచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అమ్రాబాద్ లోని చెంచుగుడాలు ఇప్పటికి అభివృద్ధి జరగలేదన్నారు. దుందుభి నదిలో రేవంత్ రెడ్డి ఫొటో పెట్టుకొని మరి ఇసుక దోచుకుంటున్నారు. అధికారులు దృష్టి సారించి ఇసుక మాఫియా అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని కులాల వారికి సరి సమానంగా అభివృద్ధి జరగాలి. అందరికీ అవకాశాలు రావాలి అందుకోసమే సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ జాగృతి కట్టుబడి ఉందని అన్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించి రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
Read More..
కాళేశ్వరంతో నీళ్లిచ్చింది ఆరున్నర లక్షల ఎకరాలకే.. ఎమ్మెల్సీ కవిత షాకింగ్ కామెంట్స్






