- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్ నినో ఎఫెక్ట్.. వేడితో అల్లాడిపోతున్న తెలంగాణ
తెలంగాణ రాష్ట్రాన్ని భానుడు తన ప్రచండ రూపంతో వణికిస్తున్నాడు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రాన్ని భానుడు తన ప్రచండ రూపంతో వణికిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న 'ఎల్ నినో' (El Nino) ప్రభావంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా ముదురుతోంది. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 43 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటి నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామంలో 43 డిగ్రీలు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, జగిత్యాల జిల్లా ధర్మపురి, సూర్యాపేట జిల్లా మోతెలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు ప్రధాన నగరాలు కూడా వేడి గాలులతో అల్లాడిపోతున్నాయి. రాజధాని హైదరాబాద్‌లో సైతం గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. వేడి గాలుల తీవ్రత పెరగడంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో జూన్ 20 వరకు ఇదే పరిస్థితి కొనసాగనుందని అధికారులు చెబుతున్నారు.






