- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టుకున్న అక్రమ ఇసుక టిప్పర్లు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్.ఐ) కష్టపడి పట్టుకున్నారు. కదలకుండా కాపలగా ఉంటూ పోలీస్ స్టేషన్ కి తరలించేందుకు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దిశ, మక్తల్ : అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్.ఐ) కష్టపడి పట్టుకున్నారు. కదలకుండా కాపలగా ఉంటూ పోలీస్ స్టేషన్ కి తరలించేందుకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ దాదాపు మూడు గంటలు గడిచినా పోలీసులు ఘటన స్థలానికి చేరుకోలేదు. ఈ ఘటన మక్తల్ నియోజకవర్గంలోని మాగనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాడ్వాట్ గ్రామ సర్కిల్ వద్ద శనివారం చోటు చేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి పది అక్రమ ఇసుక ట్రిప్పర్లను తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు పట్టించారు. మధ్యలో వదిలేయడంతో బరితెగించిన ఇసుక మాఫియా వాళ్ళు శనివారం పట్ట పగలు అక్రమంగా వడ్వాట్ సత్యవర్ గ్రామం మధ్యన ఉన్న పెద్దవాగు నుంచి మూడు టిప్పు లను అక్రమ ఇసుక తరలిస్తుండగా సమాచారం మేరకు మాగనూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పట్టుకున్నారు. దాదాపు నాలుగు గంటలుగా ఇసుక టిప్పర్లు కదలకుండా వాటి ముందే రెవెన్యూ ఆర్ ఐ కాపల కాస్తున్నారు. వీటిని పోలీస్ స్టేషన్ కి తరలించేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ, కలెక్టర్ కి డయల్ 100 ద్వారా సమాచారం ఇచ్చినా అధికారులు స్పందించలేదు. దీని వెనుక రాజకీయ ఒత్తిడిలు ఉన్నాయా..? లేక మాముళ్లకు పోలీసులు లొంగడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు.






