- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టపగలే ఇసుక అక్రమ రవాణా
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది.

పట్టపగలే ఇసుక అక్రమ రవాణా
సమాచారం ఇస్తే... తెలుసుకుంటామంటున్న అధికారులు
చోద్యం చూస్తున్న రెవెన్యూ పోలీస్ అధికారులు
దిశ, మిడ్జిల్ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. శుక్రవారం మండలంలోని వాడ్యాల గ్రామ శివారులో దుందుభి వాగు నుండి అదే గ్రామానికి చెందిన కొంతమంది ట్రాక్టర్ యజమానులు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న పట్టించుకోని అధికారులు. ఫిర్యాదులు అందిన సందర్భంలో తప్ప మిగిలిన సమయాల్లో అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించడంలేదనే విమర్శలున్నాయి. కొంతమంది నాయకులు దీనినే ప్రధాన వృత్తిగా పెట్టుకొని దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. అప్పుడప్పుడూ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా.. ఏమాత్రం బెదరని మాఫియా యథేచ్ఛగా స్థానిక వాగుల నుంచి ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నది. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టపగలే అతివేగంతో ట్రాక్టర్లు రోడ్లపై ప్రయాణిస్తుంటే ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇసుక దందాకు అధికారులు సహకరిస్తున్నారని ప్రజలు బాహటంగానే చర్చించుకుంటున్నారు. జిల్లా అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని దుందుభి వాగు పరిసర ప్రాంతాల రైతులు కోరుతున్నారు..






