- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాత తేదీలతో ఇసుక అక్రమ తరలింపు
మండల పరిధిలోని తూముకుంట వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.

దిశ, వీపనగండ్ల : మండల పరిధిలోని తూముకుంట వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. గురువారం ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వాగు నుంచి ఇసుకను రాత్రి పగలు తేడా లేకుండా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇసుక అవసరమైన లబ్ధిదారులు ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే కొందరు వ్యక్తులు పాత తేదీలతో ఉన్న అనుమతులను చూపిస్తూ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి చెల్లుబాటు అయ్యే ఆన్‌లైన్ నమోదు లేకుండానే ఇసుకను యథేచ్ఛగా తరలించడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన ప్రజా ప్రతినిధులే ఈ వ్యవహారంలో భాగస్వాములవుతున్నారనే ఆరోపణలు మరింత ఆందోళనకరంగా మారుస్తున్నాయి. అదే గ్రామానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి తన సొంత ట్రాక్టర్ ద్వారా ఇసుకను అక్రమంగా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.






