మీ సేవ సెంటర్ కాదు.. "మీ సేవలో దోపిడి" సెంటర్..!

by Bhanu |

ప్రస్తుతం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ ఇంటర్నెట్ నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

మీ సేవ సెంటర్ కాదు.. మీ సేవలో దోపిడి సెంటర్..!
X

దిశ, గట్టు: ప్రస్తుతం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ ఇంటర్నెట్ నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని.. కొందరు మీసేవ సెంటర్, ఇంటర్నెట్ నిర్వాహకులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.500 నుంచి వెయ్యి వరకు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కేటిదొడ్డి మండల కేంద్రంలోని‌ ఓ మీసేవ సెంటర్ లో రేషన్ కార్డుల కోసం వెయ్యి రూపాయాల వరకు వసూళ్లు‌ పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారుల నుంచి మినిమం చార్జ్ తీసుకోవాలి కాని రూ.500-1000 వరకు వసూళ్లు చేస్తున్నారని అనుమానంతో ప్రజలు నిలదీయగా.. మీసేవ సెంటర్ నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు లేవని తేలింది.


ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కొత్తగా మీ సేవ సెంటర్ ఏర్పాటు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా మీసేవ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. అయినప్పటికీ ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు ప్రజలను ఆకర్షించడానికి షాపు ముందు మీసేవ సెంటర్ చిహ్నం బోర్డు ఏర్పాటు చేసుకుని లావాదేవీలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రేషన్ కార్డు కోసం ప్రజల నుంచి అప్లికేషన్స్ తీసుకొని తమకు తెలిసిన మీ సేవసెంటర్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇలా రేషన్ కార్డుల కోసం రూ.500 నుంచి రూ.1,000 వరకు తీసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా బహిరంగానే అనుమతులు లేని మీ సేవసెంటర్ లో వినియోగదారుల జేబులకు చిల్లిలు పడుతున్నా జిల్లా ఈడిఎం ఎలాంటి తనిఖీలు‌ చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా రేషన్ కార్డు దరఖాస్తుదారుల నుంచి అధిక వసూళ్లకు పాల్పడుతున్న ఆరోపణలు వస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన ఈడిఎం కార్యాలయాలకే పరిమితమైనారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై వివరణ కోరేందుకు ఈడిఎం ను ఫోన్ లో సంప్రదించగా అక్రమ వసూళ్లు మా దృష్టికి రాలేదు, ఒక వేళ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Next Story