- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోడుగల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ గుర్తింపు
దిశ, జడ్చర్ల : జడ్చర్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోడుగల్ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ లో ప్రతిభ

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోడుగల్ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ లో ప్రతిభ కనబరచడంతో మద్రాస్ ఐఐటి గుర్తింపు పొందారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా 10వ తరగతి విద్యార్థులు “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ,డేటా సైన్స్” కోర్సును ఎనిమిది వారాలపాటు ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేశారు. తదుపరి నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ సర్టిఫికెట్‌లు కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా విద్యాధికారి ప్రవీణ్‌కుమార్ సమక్షంలో విద్యార్థులు సర్టిఫికెట్‌లను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులు ఐఐటీ స్థాయి శిక్షణలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడం అభినందనీయం అన్నారు. ఐఐటీ మద్రాస్ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక అవగాహన పెరుగుతోందని తెలిపారు. ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయం అన్నారు. ఇలాంటి అవకాశాలు ప్రతిభావంతమైన విద్యార్థులకు అందించాలన్నారు. జడ్చర్ల ఎంఈఓ మంజులాదేవి, హెడ్‌మాస్టర్ మారేపల్లి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు శశిధర్, మల్లికార్జున్, తాహేర్, విద్యార్థులు అంబికా, సుప్రియ, జయశ్రీ, గీత, శశికుమార్, శ్రీధర్ పాల్గొన్నారు.






