మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక ఇప్తార్ విందు : కాంగ్రెస్ మండ‌ల అధ్య‌క్షుడు కే.ఎం. నారాయ‌ణ

by Ratna Kumari |

మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక ఇఫ్తార్ విందు అని కాంగ్రెస్ మండ‌ల అధ్య‌క్షుడు కే.ఎం. నారాయ‌ణ పేర్కొన్నారు.

మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక ఇప్తార్ విందు : కాంగ్రెస్ మండ‌ల అధ్య‌క్షుడు కే.ఎం. నారాయ‌ణ
X

దిశ, మహమ్మదాబాద్ : మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక ఇఫ్తార్ విందు అని కాంగ్రెస్ మండ‌ల అధ్య‌క్షుడు కే.ఎం. నారాయ‌ణ పేర్కొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా మహమ్మదాబాద్ మండలం పరిధిలోని నంచర్ల గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం నారాయణ ఆదివారం ముస్లిం సోదరులకు ఘ‌నంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తన నివాసం వద్ద నిర్వహించిన ఇఫ్తార్ విందు కి ముస్లిం సోదరులు, ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా కేఎం నారాయణ మాట్లాడుతూ రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని అన్నారు. అన్ని మతాల ప్రజలు ఐకమత్యంతో కలిసి జీవించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు మాజీ కోఆప్షన్ మెంబర్ ఈసా బస్రావి, యుసుబ్, డాక్టర్ నవాజ్, రఫీ, సిరాజ్, షేఖిల్, జావేద్, నజిర్ పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు జే. వీరాజీ, ఎం. రాంచంద్రయ్య, పుల్లయ్య, జి. సంజివరెడ్డి, సి. హన్మంత్, జి. లక్ష్మీకాంత్ రెడ్డి, జే. సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

Next Story