మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

by Disha Web Desk 11 |
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
X

దిశ, జడ్చర్ల: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ వద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముఖిత్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింల‌కు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వైస్ చైర్మన్ సారిక, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed