- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాడు వరి వేస్తే ఉరి అన్నారు.. నేడు వరి వేయండి.. బోనస్ ఇస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి
గత ప్రభుత్వంలో వరి వేస్తే ఉరి అని రైతులను ఇబ్బంది పెట్టారని, ప్రజా ప్రభుత్వంలో వరి వేయండి సన్నా వడ్లకు బోనస్ ఇస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, మిడ్జిల్ : గత ప్రభుత్వంలో వరి వేస్తే ఉరి అని రైతులను ఇబ్బంది పెట్టారని, ప్రజా ప్రభుత్వంలో వరి వేయండి సన్నా వడ్లకు బోనస్ ఇస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని బోయినపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్ ను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తా తో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ 33/11 కేవీ సబ్‌స్టేషన్ ద్వారా మిడ్జిల్ మండలంలోని పలు గ్రామాలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండేళ్లలోనే రూ.213 కోట్ల నిధులు తీసుకొచ్చారని తెలిపారు.
ఎప్పుడూ లేనంతగా నియోజకవర్గంలో 22 సబ్ స్టేషన్లను మంజూరు చేయించుకున్న ఘనత ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దేనని అన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని మొదటగా అసెంబ్లీలో జడ్చర్ల ఎమ్మెల్యే సూచించారని సభా ముఖంగా గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారం ఉంటుందని మంత్రి తెలిపారు. మండలంలో ముదిరాజ్ భవన నిర్మాణం నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జూన్ నాటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మిడ్జిల్ మండలానికి వస్తున్నట్లు తెలిపారు సీఎం రాకతో మిడ్జిల్ ఉమ్మడి మండలం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఓట్ల కోసం కాదు.. అభివృద్ధి ముఖ్యమని అన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు అభివృద్ధిలో భాగ్యస్వాములు కావాలని తెలిపారు. గతంలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. నేడు ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు. ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటే ప్రభుత్వంలో ఉండి కొట్లాడి నిధులు తెచ్చిన ఘనత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కే దక్కిందన్నారు. ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తున్నారని, ప్రతిపక్ష పాత్ర కూడా తానే పోషిస్తున్నాడని గుర్తు చేశారు.
మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే వరకు జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 31 సబ్‌స్టేషన్లు మాత్రమే ఏర్పాటు అయితే.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత గత రెండు సంవత్సరాలలోనే 22 (33/11 కేవీ) సబ్‌స్టేషన్లు, అలాగే నవాబ్‌పేట్‌లో 133/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేయించామని తెలిపారు. వాటిలో భాగంగా బోయిన్‌పల్లి గ్రామంలో మొదటి సబ్‌స్టేషన్‌ను మంత్రి శ్రీహరి ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. నియోజకవర్గంలో విద్య , వైద్యం కోసం కృషి చేస్తామని అన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ , లో వోల్టేజ్ సమస్యలు లేకుండా రైతులకు ఉచిత కరెంటు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనని అన్నారు. బోయిన్ పల్లి గ్రామంలో రూ .3 కోట్ల 50 లక్షలతో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గత రెండు నెలల నుండి గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం , ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తూ ప్రజలకు మరింత చేరువైందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాకతో మిడ్జిల్ రూప రేఖలు మారుతాయి అని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం మొదటిసారి మండలానికి వచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి కి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి , ఎమ్మెల్యేలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శశికళ, ఉప సర్పంచ్ రామస్వామి, విద్యుత్ డిఈఈ చంద్రమౌళి , ఏడిఈ చంద్రశేఖర్ , ఏఈ నరేందర్ గౌడ్, తహసిల్దార్ స్వప్న , ఎంపీడీవో గీతాంజలి , నాయకులు బాల్ రెడ్డి , సాయిలు, వెంకటయ్య, ప్రశాంత్ రెడ్డి , మల్లికార్జున్ రెడ్డి , శ్రీశైలం యాదవ్ , నాగరాజుగౌడ్ , రాములు, సత్యం గౌడ్, శివప్రసాద్, బాబా పాల్గొన్నారు.






