పేదోడు ఏడిస్తే .. నా కళ్లలో నీళ్లు వస్తయ్

by Ratna Kumari |

పెన్షన్ బకాయిల భారం కారణంగా ఇటీవల మృతి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండయ్య కుటుంబాన్ని గండీడ్ మండలం కొంరెడ్డిపల్లి గ్రామంలోని వారి నివాసంలో మంగళవారం క్రియాశీల సామాజిక కార్యకర్త బక్క జడ్సన్, వివిధ పెన్షనర్ల సంఘాల నాయకులు కలిసి పరామర్శించారు.

పేదోడు ఏడిస్తే .. నా కళ్లలో నీళ్లు వస్తయ్
X

దిశ, మహమ్మదాబాద్ /గండీడ్ :పెన్షన్ బకాయిల భారం కారణంగా ఇటీవల మృతి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండయ్య కుటుంబాన్ని గండీడ్ మండలం కొంరెడ్డిపల్లి గ్రామంలోని వారి నివాసంలో మంగళవారం క్రియాశీల సామాజిక కార్యకర్త బక్క జడ్సన్, వివిధ పెన్షనర్ల సంఘాల నాయకులు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు కేసీ వెంకటేశ్వర్లు, వి. పరమేశ్వర్, పి. వెంకటస్వామి, కే. సురేష్, గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ పాల్గొన్నారు. పెన్షన్ ఆలస్యం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొండయ్య గారి మృతి ప్రభుత్వ వ్యవస్థలోని నిర్లక్ష్యానికి ప్రతీకగా మారిందని వారు పేర్కొన్నారు. కుటుంబానికి తక్షణ సహాయం అందించిన అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా వారు అభినందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే పెన్షనర్లకు సంబంధించిన అన్ని బకాయిలను ఏక మొత్తంగా చెల్లించాలని, పెన్షన్ల కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్షన్ రిటైర్డ్ ఉద్యోగికి చివరి ఆధారం అని, దానిలో జాప్యం ప్రాణాలపై ప్రభావం చూపుతోందని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షనర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

Next Story