జిల్లాను రద్దు చేస్తే అగ్గి రాజేస్తాం : మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి

by Ratna Kumari |

నారాయ‌ణ పేట జిల్లాను ర‌ద్దు చేస్తే అగ్గి రాజేస్తామ‌ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

జిల్లాను రద్దు చేస్తే అగ్గి రాజేస్తాం : మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి
X

దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : నారాయణపేట జిల్లాను రద్దు చేస్తే.. పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రాజస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి నారాయణపేట జిల్లాను సాధించుకుందామని అలాంటి జిల్లాను కుట్రపూరితంగా రద్దు చేస్తామంటే సహించే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ ఎస్ నారాయణపేట పట్టణ ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో ఏర్పాటు అయినటువంటి నారాయణపేట జిల్లా నేటికీ ఎనిమిది సంవత్సరాలు కావస్తుందని ఉమ్మడి మహబూబ్ న‌గ‌ర్ జిల్లాలోని ఈ ప్రాంతం ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి నారాయణపేట జిల్లాను మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి జిల్లాను రద్దు చేయడం సబాబు కాదని ఆయన అన్నారు నారాయణపేట జిల్లా కొనసాగుతుందని అలాంటి అభివృద్ధి చెందుతున్న నారాయణపేట జిల్లాను ఎంతవరకు న్యాయమని ఆయన అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలు అశాస్త్రీయ పద్ధతుల్లో ఏర్పాటు చేయడం జరిగిందని.. అలాంటి జిల్లాలను 17 జిల్లాలుగా మార్చి మిగిలిన 12 జిల్లాలను రద్దు చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు రాబోయే బడ్జెట్ స్టేషన్లో రద్దయ్య జిల్లాలకు సంబంధించి రిపోర్ట్ అడిగే అవకాశాలు ఉన్నాయని, నారాయణపేట జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ బహిరంగ సభలో మా పార్టీ కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడిన తర్వాత జిల్లాల రద్దు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గిందని ఆయన అన్నారు. నారాయణపేట జిల్లాకు ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు టెండర్లు అయినప్పటికీ వాటిని రద్దు చేస్తూ నేటికీ కొత్త టెంట్లను పిలవలేదని వీటన్నిటిని గమనిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలను రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంద‌న్నారు. నారాయణపేట పట్టణంలో గత రెండు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన ప్రగతి ఏమీ లేదని ఆయన అన్నారు. నూతనంగా నిర్మిస్తున్నటువంటి కలెక్టర్ కార్యాలయం చుట్టుపక్కల పెద్దపెద్ద భవంతులను ఏర్పాటు చేసుకున్నారని, జిల్లాను రద్దు చేస్తే ఈ భవంతులకు విలువ ఏమీ ఉండదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, ఏపూరి రాములు, కన్నా జగదీష్, సాగర్ చెన్నారెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story