- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు చాలా మేలు : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.

దిశ, కేటీ దొడ్డి : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. గద్వాల నియోజకవర్గంలోని కే.టీదొడ్డి మండల కేంద్రంలో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణం కొరకు స్థలాన్ని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి వస్తే నియోజకవర్గంలోని విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలతో హాస్టల్ సౌకర్యంతో నాణ్యమైన ఆంగ్ల విద్య, అనుభవం ఉపాధ్యాయులచే విద్యార్థులకు బోధన, ఆహ్లాదకర మైన వాతావరణంలో ఉంటుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువుకొని భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలి గద్వాల ప్రాంతం కూడా అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉండాలని లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, మాజీ ఎంపీపీ విజయ్ జిల్లా సర్పంచులు సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచ్ నారాయణ, జిల్లా సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, విక్రమ్ సింహారెడ్డి, నాయకులు ఉరుకుందు, ఆంజనేయులు, మల్లేష్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు.






