స్థానిక ఎన్నిక‌ల్లో ఆ ఒక్క‌టి నొక్కితే.. అభ్య‌ర్థుల గుండెల్లో గుబులు

by Ratna Kumari |

దిశ‌, అడ్డాకుల : గ‌త స్థానిక ఎన్నిక‌ల్లో అభ్యర్థులు నిలబడిన వారికే తప్పనిసరిగా అభ్యర్థులపై ఇష్టమున్న లేకున్నా ఓటు వేయవలసి ఉండేది. కానీ స్థానిక ఎలక్షన్ లో సందడి ఇంత అంతా కాదు.. గ్రామాలలో

స్థానిక ఎన్నిక‌ల్లో ఆ ఒక్క‌టి నొక్కితే.. అభ్య‌ర్థుల గుండెల్లో గుబులు
X

దిశ‌, అడ్డాకుల : గ‌త స్థానిక ఎన్నిక‌ల్లో అభ్యర్థులు నిలబడిన వారికే తప్పనిసరిగా అభ్యర్థులపై ఇష్టమున్న లేకున్నా ఓటు వేయవలసి ఉండేది. కానీ స్థానిక ఎలక్షన్ లో సందడి ఇంత అంతా కాదు.. గ్రామాలలో పబ్లిక్ ప్లేసులలో ముఖ్యంగా టీ కొట్టు దగ్గర హోటల్ దగ్గర ముఖ్యంగా వైన్ షాప్ దగ్గర ఎవరు నిలబడుతున్నారు వారి గురించి ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఊర్లో బడా నాయకులు వచ్చి చర్చలు జరుగుతూ వారికా వీరిక నిలబడి వారిని నిర్ధారించడానికి గ్రామాలలో చర్చలు జరుగుతున్నాయి. అగ్రకులస్తులైన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే స్థానిక ఎలక్షన్లో జనరల్ రిజర్వేషన్లకు ఒక్కరికైనా బీసీలను నిలబెట్టుకుని గెలుచుకునే ఛాన్స్ ఇస్తారా అనే ఉద్దేశంతో ప్రజలు గమనిస్తున్నారు. ఖద్దరు వెనుక ప్రజా ఓటు బ్యాంకు ఉందా లేదా గమనించ గలగాలని ముఖ్య ప్రజా ప్రతినిధులను ప్రజలు కోరుతున్నారు.

సైలెంట్ ఓటు బ్యాంకుగా బీసీలు

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోక బీసీలను మోసం చేసిందని బీసీ నాయకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీసీలో చాపకింద నీరులా అందరితో పాటు అన్ని పార్టీలో తిరుగుతూ ఓటు బ్యాంకు ను బీసీలకే మలుచుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నాయని విశ్లేషకుల అంచనా వేశారు. అడ్డాకుల‌ మండల కేంద్రంలో జనరల్ రిజర్వేషన్ కేటాయించడంతో మమ్మురంగా కాంగ్రెస్ అభ్యర్థిని నియమించడం కోసం ప్రస్తుత ఎమ్మెల్యే, బీ ఆర్ఎస్ పార్టీ ప్రస్తుత అభ్యర్థిని నియమించుటకై మాజీ జ‌డ్పీటీసీ రంగంలోకి దిగి మంతనాలు జరుపుతున్నారు.ఇరుపార్టీలకు రెబల్స్ బెడల్ తో అడ్డాకుల మండల కేంద్రంలో ఇంతగా తలనొప్పిగా ఉంటున్నట్లు తెలుస్తుంది. అడ్డాకుల మండల కేంద్రంలో అయితే పార్టీలకు చెందిన ఇండిపెండెంట్గు ఎనిమిది నుండి పదిమంది బరిలో పోటీల్లో దిగూతున్నట్లుగా విశ్వనీయ సమాచారం. ఇంతగా పోటీ పడడానికి కారణం ప్రధాన పోటీ పడడానికి కారణం మైనింగ్ తో పాటు ఇండస్ట్రీస్ ఏరియా ఉండడం వల్ల సంపాదనకు కొలువు లేదు కాబట్టి పోటీపడుతున్నట్లు విశ్లేషకుల అంచనా. కోట్ల రూపాయలు సంపాదించాలని అగ్రకులస్తులు ముందుకొస్తున్నారని బీసీ నాయకులు మండిపడుతున్నారు. అందుకు బీసీ నాయకులకు మద్దతు ఇవ్వండని వారు కోరుతున్నారు. పార్టీలను పక్కనపెట్టి బీసీ నాయకులను ఎన్నుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారం ముమ్మురంగా సాగుతుంది. స్థానిక ఎలక్షన్లో గ్రామస్థాయిలో నిలబడిన అభ్యర్థి నచ్చకుంటే ఈ సంవత్సం ఎన్నికల కమిషనర్ చేపట్టిన ఎన్నికల గుర్తుల్లో NOTA గుర్తు బటన్ పై నొక్కడంతో అభ్యర్థి గుండెల్లో గుబులు చేకూరుతుంది.

Next Story