జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తా : మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేంద‌ర్ రెడ్డి

by Ratna Kumari |

జర్నలిస్టు మిత్రులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ఆదివారం దిశ కు తెలిపారు.

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తా :  మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేంద‌ర్ రెడ్డి
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : జర్నలిస్టు మిత్రులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ఆదివారం దిశ కు తెలిపారు. జర్నలిస్టు మిత్రులు విధుల నిర్వహణలో ఆర్థికంగా.. వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. జర్నలిస్టుల పరిస్థితులను అర్థం చేసుకొని తనవంతుగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించిన‌ట్టు తెలిపారు. నారాయణపేట నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలు, నారాయణపేట జిల్లా కేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టులకు ప్రమాద బీమా, జర్నలిస్టులు వారి కు టుంబాలకు కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ తన సొంత డబ్బులతో చేయిస్తానని వెల్లడించారు. ఇందుకు సంబంధించి అర్హులైన జర్నలిస్టుల ఎంపిక ప్రక్రియను చేపట్టడం జరిగిందని ఆయన వెల్లడించారు.

Next Story