- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీలకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం : జేఏసీ నాయకులు
దిశ, అచ్చంపేట : బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేసే విషయంలో అగ్రవర్ణ నాయకులు అడ్డుకుంటున్నారని దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని అందుకు నిరసనగా నాగర్ కర్నూల్

దిశ, అచ్చంపేట : బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేసే విషయంలో అగ్రవర్ణ నాయకులు అడ్డుకుంటున్నారని దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని అందుకు నిరసనగా నాగర్ కర్నూల్ అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రాజు, కాసన్న యాదవ్, అనిల్, వర్ధం సైదులు, మండికారి బాలాజీ తదితరులు మాట్లాడుతూ.. బీసీలందరం ఏకమవుతున్నాం ఇక మీ ఆగడాలు చెల్లవని రానున్న స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని అగ్రవర్ణ నాయకులు ఎక్కడ నిలబడ్డా వారికి ఓటమి తప్పదని.. బీసీలు ఎంత ఉన్నామో అంత శాతం తప్పక అమలు చేయాలని అన్ని పార్టీలలో ఉన్న బీసీలందరూ ఏకతాటిపై వచ్చి ఆయా పార్టీ నాయకులను నిలదీయాలని సందర్భంగా కోరారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని.. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీలకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం, మేమెంతో మాకు అంత శాతం ఖబర్దార్ అగ్రవర్ణ నాయకుల్లారా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాహనాలను పోలీసులు దారి మళ్ళించారు.






