- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జలవిద్యుత్ పేరిట శ్రీశైలం నీటిని ఏపీ ప్రభుత్వం దోచుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుంది : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
జల విద్యుత్ పేరిట ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నీటిని దోచుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, పాన్ గల్ : జల విద్యుత్ పేరిట ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నీటిని దోచుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా పాన్ గల్ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి కొల్లాపూర్, దేవరకద్ర మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డిలతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేస్తే.. 25 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 150 కోట్లు గోపాల్ దీన్నే- సింగోటం లింకు కెనాల్ కు మంజూరు చేస్తే.. ఇప్పటికీ పనులు పూర్తి కావడం లేదన్నారు. గుత్తేదారు స్థానిక మంత్రికి స్నేహితుడే అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పనులను ఎందుకు పూర్తి చేయడం లేదనీ విమర్శించారు. జిల్లా మంత్రి జూపల్లి ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. పనులు పూర్తయితే సొంత నియోజకవర్గంలోని రైతులకు యాసంగి పంటకు కూడా సాగునీరు అందుతుందన్నారు. రామన్న గట్టు రిజర్వాయర్ కోసం 500 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను రద్దు చేయడం జరిగిందన్నారు. పాన్ గల్ కు 132కేవీ సబ్ స్టేషన్ మంజూరు చేస్తే ఇప్పటికే పనులు మొదలు కాలేదు అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వీర సాగర్ నాయకులు జ్యోతి నందన్ రెడ్డి, చంద్ర శేఖర్ నాయక్,అడ్వకేట్ రవి, రాజేష్ రెడ్డి, తిలక్, భాస్కర్ రెడ్డి, ధశరత్ నాయుడు మిద్దె కృష్ణ రాంచందర్ చంద్రు నాయక్ కిషోర్ శెట్టి నవీన్ రెడ్డి పాల్గొన్నారు.






