- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించే వరకు పోరాడుతాను : పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
రామగుండం నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించే వరకు కేంద్ర ప్రభుత్వం పై పోరాటం చేస్తానని పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ హెచ్చరించారు.

దిశ, గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించే వరకు కేంద్ర ప్రభుత్వం పై పోరాటం చేస్తానని పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ హెచ్చరించారు. బుధవారం గోదావరిఖని జవహర్ లాల్ స్టేడియంలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఆంధ్రలో 10 ఎయిర్ పోర్టులు ఉంటాయి. కానీ తెలంగాణలో మాత్రం ఒకటే ఎయిర్ పోర్టు ఉండడమేంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ, తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఎంపీ కిషన్ రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎందుకు న్యాయం చేయడం లేదంటూ ప్రశ్నించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి కావాలని పలుమార్లు ప్రస్తావించిన నిధులు కేటాయించడం లేదన్నారు. సింగరేణి విశ్రాంతి కార్మికులకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం పార్లమెంట్ లో మాట్లాడానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్, విజయ్, బోయిని మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






