- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ - శ్రీశైలం రాకపోకలు బంద్
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం హైదరాబాద్ శ్రీశైలం 765 జాతీయ రహదారి లతీపూర్ స్టేజి సమీపంలో గల డిండి ప్రాజెక్టు అలుగు బ్రిడ్జి డేమేజ్ కావడంతో హైదరాబాద్

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం హైదరాబాద్ శ్రీశైలం 765 జాతీయ రహదారి లతీపూర్ స్టేజి సమీపంలో గల డిండి ప్రాజెక్టు అలుగు బ్రిడ్జి డేమేజ్ కావడంతో హైదరాబాద్ శ్రీశైలం రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు డీఎస్పీ పల్లె శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. భారీగా కురిసిన వర్షాల కారణంగా అచ్చంపేట నియోజకవర్గం లో పలు ప్రాంతాల్లో అతిబరీ వర్షాలు కురవడం మూలంగా శ్రీశైలం జాతీయ రహదారి అచ్చంపేట మండలం హాజీపూర్ నుంచి దిండి వరకు గల పలు బ్రిడ్జిలు వరద తాకిడికి ప్రమాదానికి గురి అవకాశం ఉందని ఈ నేపథ్యంలోనే లతీపూర్ వద్ద వరద ఉధృతి వేగంగా రావడం వలన బ్రిడ్జి డామేజ్ కావడంతో కోతకు గురి కావడంతో రోడ్డు పై గోతు ఏర్పడిందని తద్వారా ఈ రహదారి ప్రమాద భరితమని రాకపోకలు చేయడం సురక్షితం కాదన్నారు. బ్రిడ్జి ఆనుకొని ఉన్న ప్రదేశం కూడా కోతకు గురై మట్టి కొట్టుకొని పోతుందన్నారు. హైదరాబాదు వెళ్లాలనుకునే అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా బల్మూరు లింగాల తెలకపల్లి మండలాల మీదుగా నాగర్కర్నూల్ చేరుకొని హైదరాబాద్ వెళ్లడం సురక్షితమని ప్రజలకు, పత్రికలకు సూచించారు.






