భార్యపై కోడవలితో భర్త దాడి.. పరిస్థితి విషమం

by Kodari Anjali |

భర్త భార్యపై కొడవలితో దాడి చేసిన ఘటన మల్దకల్ మండలం, మల్లెందొఢ్డి గ్రామంలో జరిగింది.

భార్యపై కోడవలితో భర్త దాడి.. పరిస్థితి విషమం
X

దిశ, మల్దకల్: భర్త భార్యపై కొడవలితో దాడి చేసిన ఘటన మల్దకల్ మండలం, మల్లెందొఢ్డి గ్రామంలో జరిగింది. వివరాల్లోకెళ్తే... మాట మాట పెరిగి తీవ్ర క్షణికావేశానికి గురైన భర్త తిమ్మప్ప భార్య మహేశ్వరిపై కొడవలితో తలపై దాడి చేశాడు. దీంతో మహేశ్వరికి తీవ్ర గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం మహేశ్వరిని గద్వాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. కాగా భర్త తిమ్మప్ప వ్యసనాలకు బానిసై తరుచూ భార్యతో గొడవ పడేవాడని మద్యం మత్తులోనే భార్యపై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

Next Story