బస్టాప్‌లోకి దూసుకెళ్లిన బొలెరో.. ఇద్దరు మహిళలు స్పాట్ డెడ్

by Kema Shiva Kumar |

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సత్తంరాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

బస్టాప్‌లోకి దూసుకెళ్లిన బొలెరో.. ఇద్దరు మహిళలు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: అన్యాయంగా ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ (Shamshabad) పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాతంరాయి (Sathamrai) వద్ద రోడ్డు పక్కనే బస్‌స్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న మహిళలపైకి రోడ్డుపై అతివేగంతో మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో వాహనం కింద పడి సుమ (Suma), సువర్ణ (Suvarna) అనే ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ మేరకు సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఘోర ప్రమాదంతో సాతంరాయి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదే ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే జీబ్రా క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని ఆందోళణ చేపట్టారు. ఈ మేరకు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story