- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నితిన్ లేటెస్ట్ మూవీ అప్డేట్.. ఆ ఇద్దరిపై చార్మినార్ వద్ద షూటింగ్
నితిన్–వైష్ణవి చైతన్యలపై చార్మినార్ పరిసరాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం నారి, సోము దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత ఈ చిత్రంలో హీరోయిన్‌గా రితిక నాయక్‌ను ఎంపిక చేసినప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆమె స్థానంలో వైష్ణవి చైతన్యను హీరోయిన్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆ సమాచారం ప్రకారం నితిన్, వైష్ణవి చైతన్యలపై చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.
కొంతకాలంగా మాస్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసిన నితిన్ ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. అయితే ఈ చిత్రంలో ఆయన ఓ మధ్యతరగతి యువకుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాతో నితిన్ తప్పకుండా విజయాన్ని అందుకుంటారని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ చిత్రం ఆయనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా, సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.






