అడవిని తలపిస్తున్న ఏన్కూర్ మార్కెట్ యార్డ్..

by Kodari Anjali |   (  Updated:2026-07-09 04:47:36  IST  )

మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ అడవిని తలపించే విధంగా పిచ్చి మొక్కలు మొలిచాయి.

అడవిని తలపిస్తున్న ఏన్కూర్ మార్కెట్ యార్డ్..
X

దిశ, ఏన్కూర్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ అడవిని తలపించే విధంగా పిచ్చి మొక్కలు మొలిచాయి. ఖమ్మం జిల్లాలోని అతిపెద్ద మార్కెట్లో రెండో స్థానంలో ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ ఉంది. చైర్మన్ కార్యాలయం ఉన్న యార్డు మొక్కల మలిచి శుభ్రం చేసే పరిస్థితి లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ యార్డ్ కి నిధులు కొరత ఉన్నదని విశ్వాసనీయ సమాచారం. రానున్న సీజన్ దృష్టిలో ఉంచుకొని మార్కెట్ యార్డ్ ను సంబంధిత అధికారులు తమ సిబ్బందితో శుభ్రం చేయించవలసిన అవసరం ఉంది. ఆఫీస్ కి పరిమితమైతే ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపరంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తర్వాత రెండో స్థానంలో ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ నిలిచింది. ఆదాయం తెచ్చిపెట్టే వ్యవసాయ మార్కెట్‌కు సౌకర్యాలు కల్పించవలసిన ప్రభుత్వం నిధులు కేటాయింపులు జాప్యం జరుగుతుందని మార్కెట్‌ను అట్లా వదిలేస్తే రైతులు తమ పండించిన పంటలు ఆరబోసుకోవాలంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతున్నాయి. మార్కెట్లో పిచ్చి మొక్కలను తొలగించి.. రైతులకు సౌకర్యంగా ఉండే విధంగా సంబంధం మార్కెట్ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Next Story