- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుషారుగా 'హ్యాపీ సండే'
by Ratna Kumari |
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే 'హ్యాపీ సండే' కార్యక్రమం ఈ ఆదివారం హుషారుగా, ఉల్లాసంగా గడిచింది.

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే 'హ్యాపీ సండే' కార్యక్రమం ఈ ఆదివారం హుషారుగా, ఉల్లాసంగా గడిచింది. స్టేడియం గ్రౌండ్ కమాన్ వద్ద రోడ్డుపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారుల భరతనాట్యం, డ్యాన్స్ అకాడమీ విద్యార్థినీల నృత్యాలు, సినీ గీతాలపై సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యుల స్టెప్పులు లతో ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు వివరిస్తూ, మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగుతూ ప్రజల ఆదరణతో నిరాఘాటంగా సాగుతుందని అన్నారు.
Next Story






