- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బావోజీ దేవాలయ హుండీ లెక్కింపు..
by Taduka Kalyani |
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన గురు లోక మసంద్ బావాజీ బుధవారం దేవాలయ కమిటీ సభ్యుల సమక్షంలో హుండీ లెక్కింపు చేశారు.

X
దిశ, కొత్తపల్లి: నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన గురు లోక మసంద్ బావాజీ బుధవారం దేవాలయ కమిటీ సభ్యుల సమక్షంలో హుండీ లెక్కింపు చేశారు. బావాజీ దేవాలయంలో ఉన్న హుండీ రూ.18లక్షల 91,608, హనుమాన్ దేవాలయంలో హుండీ రూ. లక్ష 57,595 లు ఉన్నాయి. కాళికాదేవి ఆలయంలో ఉన్న హుండీ నీ లెక్కించగా రూ. 12లక్షల 42, 550, గేదెలకు రూ. 69,000, టెంకాయలకు రూ. 2 లక్షల 93,000, కొబ్బరి చిప్పలు రూ. 31000, తలనీలాలకు రూ. 7లక్షల 66,000 ఇంకా వెండి, బంగారు ఆభరణాలు లెక్కింపు చేయవలసి ఉందని, మొత్తంగా రూ. 44లక్షల 50,951 ల ఆదాయం వచ్చినట్లు దేవాలయ ఈఓ కోమాల్, గుడి చైర్మన్ గోపాల్ నాయక్ తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ రాణా ప్రతాప్ సింగ్, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






