- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వం చాటిన ఒబెదుల్లా కొత్వాల్
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: రోడ్డుపై ప్రమాదం జరిగినా చూసీ చూడనట్లు పోతున్న ఈ రోజుల్లో, ప్రమాదం జరిగిందని తెలుసుకొని త

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: రోడ్డుపై ప్రమాదం జరిగినా చూసీ చూడనట్లు పోతున్న ఈ రోజుల్లో, ప్రమాదం జరిగిందని తెలుసుకొని తన మానవత్వం చాటారు స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్. మంగళవారం రాత్రి జడ్చర్ల -మహబూబ్ నగర్ నేషనల్ హైవే 167 పై ఒక వ్యక్తి తన బైక్ పై నుండి పడి ప్రమాదానికి గురి కాగా ఎవ్వరూ కూడా ప్రమాదం జరిగిన వ్యక్తి ని పట్టించుకోకుండా ఎవరి మానాన వారు వెళ్లిపోతున్నారు. రోడ్డు పై విపరీతమైన వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంది. అదే సమయంలో హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ కు కారులో వస్తున్న స్టేట్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్ తన కారు ఆపి ప్రమాద సంఘటన తెలుకుని, బాధితుడికి మరో ప్రమాదం జరగకుండా ఆ వ్యక్తి ని పక్కకు తీసుకెళ్లి మంచినీరు తాగించి ధైర్యం చెప్పి 108 అంబులెన్స్ లో హాస్పిటల్ కు పంపి తన దాతృత్వం చాటుకున్నారు. బాధితుడు తలకు హెల్మెట్ ఉండడంతో ప్రాణాపాయం తప్పిందని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని కొత్వాల్ సూచించారు.






