పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ

by Batti.Sumithra |   (  Updated:2026-03-25 09:12:34  IST  )

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమవుతోంది. వాహనదారులు ఇంధనం కోసం పెట్రోల్ బంక్‌ల ముందు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు.

పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ
X

దిశ, మిడ్జిల్ : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమవుతోంది. వాహనదారులు ఇంధనం కోసం పెట్రోల్ బంక్‌ల ముందు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. బుధవారం మండల కేంద్రంలో ఉన్న మూడు పెట్రోల్ బంక్‌ల వద్ద భారీగా ఆటోలు, కారులు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు క్యూ కట్టాయి. ఇంధన సరఫరా నిలిచిపోతుందనే వదంతులు, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల భయాందోళనలు వల్ల పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తక్కువగా ఉన్నా, మరికొన్ని పెట్రోల్ బంకుల వద్ద విపరీతమైన రద్దీ ఉంది. ఇంధనం దొరుకుతుందా ? లేదా అన్న అనుమానంతో వాహనదారులు మినీ డబ్బులు, బాటిల్స్‌తో బారులు తీరారు. తమ వాహనాలతో పెట్రోల్‌ బంకుల వద్దకు క్యూకట్టి.. ట్యాంకులు ఫుల్‌ చేయించుకునే ప్రయత్నాలు వాహనదారులు చేస్తున్నారు. దీంతో బంకుల వద్ద భారీగా వాహనాలు జామవుతున్నాయి. ప్రభుత్వం ఒకవైపు ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తున్న వాహనదారులు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.

పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ.. నగరవాసులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్

సోషల్ మీడియాలో పుకార్లు.. ప్రజలు ఆగం ఆగం..

Next Story