రోడ్డు ప్రమాదం లో హోమ్ గార్డు మృతి

by Ratna Kumari |

దిశ, పెద్ద కొత్త పల్లి : మండల పరిధిలోని అదిరాల వద్ద 167కే జాతీయ రహదారి పై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో హోమ్ గార్డు మృతి చెంచెందాడు. ఈ

రోడ్డు ప్రమాదం లో హోమ్ గార్డు మృతి
X

దిశ, పెద్ద కొత్త పల్లి : మండల పరిధిలోని అదిరాల వద్ద 167కే జాతీయ రహదారి పై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో హోమ్ గార్డు మృతి చెంచెందాడు. ఈ సంఘటన కు సంబంధించి ప్రకారం.. కోడేరు మండలం పసుపుల గ్రామానికి చెందిన హోమ్ గార్డు వెంకట స్వామి (35) పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా మండలం లోని ముష్టి పల్లి గ్రామానికి బైక్ పై వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా మార్గమద్యం లో అదిరాల గ్రామం లో హైవే లో వస్తుండగా కుక్కల గుంపు ఆకస్మాతుగా అడ్డువచ్చాయి. వాటిని తప్పించబోయి ప్రమాదవశాతున్న రోడ్డు డివై డర్ కు డీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైనా అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య చెన్నమ్మ ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన పై పెద్ద కొత్త పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గా తెలిసింది. కోడేరు మండలం పసుపుల గ్రామంలో విషాదం నెలకొన్నది.

Next Story