హోలీ పండగ దీని కోసమే జరుపుకుంటారు: ఎమ్మెల్యే

by Naveena |

యోజకవర్గ కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో డా వాకిటి శ్రీహరి మిత్ర బృందం అధికారులతో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.

హోలీ పండగ దీని కోసమే జరుపుకుంటారు: ఎమ్మెల్యే
X

దిశ, మక్తల్: నియోజకవర్గ కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో డా వాకిటి శ్రీహరి మిత్ర బృందం అధికారులతో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని అఖిలపక్ష నాయకులు ,యువకులు ఎమ్మెల్యేకి రంగులు అంటించి శుభాకాంక్షలు తెలియజేశారు . తరువాత ఎమ్మెల్యే తీన్ మార్ కొట్టి అందరినీ ఉత్సహపరిచారు. చెడుపై విజయం సాధించిన సంతోషంతో చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ సంబరాలను జరుపుకోవడం ఆనవాయితీ అని అన్నారు. ఎవరి మనోభావాలను కించపరచకుండా ప్రజలందరూ హోలీ పండుగను జరుపుకోవాలన్నారు. ఉత్సవంలో మక్తల్ పట్టణానికి చెందిన అన్ని వర్గాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు పాల్గొన్నారు.

Next Story