- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హమ్మయ్య.... ఇన్ని రోజులకు పింఛన్ డబ్బులు ఇచ్చినా అధికారులు
దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడం లేదన్న చందంగా ధన్యాడ చేయూత పింఛన్ లబ్ధిదారుల పరిస్థితి తయారైంది.

దిశ, ధన్వాడ : దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడం లేదన్న చందంగా ధన్యాడ చేయూత పింఛన్ లబ్ధిదారుల పరిస్థితి తయారైంది. ఏప్రిల్ నెలకి సంబంధించి ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు నిధులు మంజూరు చేసింది. కానీ బ్యాంకుల్లో డబ్బుల కొరత కారణంగా డబ్బుల పంపిణీ తీవ్ర ఆలస్యంగా కొనసాగింది. పింఛన్ డబ్బుల కోసం ప్రతిరోజు లబ్ధిదారులు ధన్వాడ పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగి గంటలు తరబడిగా ఎదురు చూశారు. ప్రతిరోజు డబ్బులు లేవని లబ్దారులను వాపస్ పంపినప్పుడల్లా ఓపిక నశించి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, రోడ్డు ఎక్కి ఆందోళన చేపట్టారు.
ఈ విషయం పై ఈనెల 6న దిశ పత్రికలో కథనం వెలువడింది. పింఛన్ల డబ్బుల కోసం ముప్పు తిప్పలు.. ఎండల్లో డబ్బుల కోసం ముసలోళ్ల నిరీక్షణ.. అధికారుల నిర్లక్ష్యం అనే కథనాన్ని ప్రచురించింది. ఎట్టకేలకు అధికారులు స్పందించి శుక్రవారం పింఛన్ డబ్బులను పంపిణీ కి శ్రీకారం చుట్టారు. ఇటీవల దిశ పత్రికలో వచ్చిన కథనం ద్వారానే అధికారుల్లో చలనం వచ్చిందంటూ పలువురు అభినందనలు తెలిపారు. చశుక్రవారం ఉదయం నుంచి పింఛన్ల డబ్బులను సంబంధిత అధికారులు పంపిణీ చేస్తున్నారు.






