- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఒక్క పని చేసిన చరిత్ర.. కాంగ్రెస్ ప్రభుత్వానిది : ఎమ్మెల్యే
దేశంలోనే వ్యవసాయానికి అత్యధిక బడ్జెట్ కేటాయించిన చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానిదేనని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు.

దిశ, దేవరకద్ర: దేశంలోనే వ్యవసాయానికి అత్యధిక బడ్జెట్ కేటాయించిన చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానిదేనని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. దేవరకద్ర మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం దగ్గర దేవరకద్ర, కౌకుంట్ల, సీసీ కుంట,అడ్డాకుల, మూసాపేట్, మండలాలకు చెందిన రైతులకు స్పింక్లర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గత డిసెంబర్ లో కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులతో IDB సమావేశం నిర్వహించి, యాసంగి పంటకు లెఫ్ట్ కెనాల్ ద్వారా పాత ఆయ కట్టు (21, 22) డిస్ట్రిబ్యూట్ కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామన్నారు. కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి వీలుకాదని తెలియజేశామని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి కూడా రైతులను రెచ్చగొట్టి, మభ్యపెట్టి.. కాంగ్రెస్ పార్టీపై బురద చల్లుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కొత్త ఆయకట్టు (డోకూర్, మినిగొనిపల్లి) కు రెండో పంటకు నీళ్లు ఇవ్వలేదు, షెడ్యూల్ ప్రకటించలేదన్నారు. వ్యవసాయం, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిని, వేసవిని దృష్టిలో ఉంచుకుని అధికారులు తో నిరంతరం చర్చిస్తూ...రైతులు నీళ్లు ఇచ్చేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇవాళ కూడా వనపర్తి ఎమ్మెల్యే తో చర్చించి, నేడు నిజలపూర్ కు నీళ్లు ఇప్పించమని తెలిపారు. రైతుల పంటలు ఎండిపోకుండా నిరంతరం పనిచేస్తూ...అందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి తో మాట్లాడి, జూరాలకు నీళ్లు తీసుకువచ్చామన్నారు.
అదేవిధంగా జూరాల నుండి మోటార్ల ద్వారా ఫర్దిపూర్ రిజర్వాయర్ కు నీళ్లు తీసుకురావడం జరిగిందన్నారు. కోయిల్ సాగర్ చరిత్రలోనే మొదటిసారి యాసంగి పంటకు నీళ్లు తీసుకువచ్చామన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడుతూ... తప్పుడు ప్రచారం చేయడం పద్దతి కాదన్నారు. దేశంలోనే వ్యవసాయానికి అత్యధిక బడ్జెట్ కేటాయించిన చరిత్ర ప్రజా ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. 21 వేలకోట్లతో 25 లక్షల మంది రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి,75% సబ్సిడీతో రైతులకు స్ప్రింక్లర్లను ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కథలప్ప, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంజిల్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు,మండల వ్యవసాయ అధికారి రాజేంద్ర అగర్వాల్, ఆర్టికల్చర్ అధికారులు, రైతులు వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






