- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత : ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
దిశ, దేవరకద్ర : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు.

దిశ, దేవరకద్ర : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కోజెంట్ కంపెనీ సహకారంతో విద్యార్థులకు స్కూల్ షూస్ పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే దేవరకద్రలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కథలప్ప, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంజిల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు , అంజన్ కుమార్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ,ప్రేమ్ యాదవ్, కోన రాజశేఖర్, తహసిల్దార్ దీపిక, ఎంపీడీవో శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు, ఎంఈఓ బలరాం, కోజెంట్ కంపెనీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






