బాధిత కుటుంబానికి చేయూత

by Ratna Kumari |

దిశ, వంగూర్ : మండల పరిధిలోని ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన గువ్వ నిరంజన్ అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన యువత చేయూత అనే

బాధిత కుటుంబానికి చేయూత
X

దిశ, వంగూర్ : మండల పరిధిలోని ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన గువ్వ నిరంజన్ అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన యువత చేయూత అనే నినాదంతో గ్రామ యువ నాయకులు ముందుకు వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. అదేవిధంగా ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఎల్లవేళలా మీ కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువత చేయూత యువ నాయకులు రవీందర్ గౌడ్, బలరాం, రాజారెడ్డి, గణేష్, నారాయణ, జంగయ్య , శేఖర్, సైదులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Next Story