స్ట్రాంగ్ రూమ్ వ‌ద్ద పోలీసుల‌తో భారీ బందోబ‌స్తు

by Nallavelli.Anjaneyulu |

మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణంలోని మిని ఇండోర్ స్టేడియంలోని ఎన్నిక‌ల కౌంటింగ్ భ‌వనంలో చేసిన ఏర్పాట్ల‌ను నారాయ‌ణ‌పేట జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ శ్రీనివాస్ గురువారం ప‌రిశీలించారు.

స్ట్రాంగ్ రూమ్ వ‌ద్ద పోలీసుల‌తో భారీ బందోబ‌స్తు
X

దిశ‌, మ‌క్త‌ల్ : మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణంలోని మిని ఇండోర్ స్టేడియంలోని ఎన్నిక‌ల కౌంటింగ్ భ‌వనంలో చేసిన ఏర్పాట్ల‌ను నారాయ‌ణ‌పేట జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ శ్రీనివాస్ గురువారం ప‌రిశీలించారు. మిని ఇండోర్ భవనంలో శుక్రవారం జరిగే కౌంటింగ్ కోసం భారీ ఏర్పాట్లు చేయడంలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలక్షన్ ఇన్ చార్జి రాజేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్, ఇంజనీర్ నాగ శివ అధికార్లకు కౌంటింగ్ ఏర్పాట్లకు తగిన సూచనలు ఇచ్చారు. మున్సిపాలిటీలో16 వార్డులకు 15 వార్డు ల్లో పోలింగ్ జరిగింది. ఎన్నికల నియమావళి ప్రకారం శుక్రవారం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మొదటిగా పోస్టల్ బ్యాలెట్స్ ని లెక్కిస్తారున్నారు. తర్వాత జనరల్ ఓట్లకు కౌంటర్ జ‌రుగుతుంది. 1 నుంచి 8 వార్డులు వ‌న్ బై వ‌న్ వ‌రుస‌గా కౌంటింగ్ ఉంటుందని.. ఆ తర్వాత 9 నుంచి 16 వార్డుల్లో కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ఒక టేబుల్ కు ఒక ఆర్వో, సూపర్వైజర్లు ఇద్దరు, ఒక‌ అసిస్టెంట్లతో కౌంటింగ్ జరుతుందని.. ఇంచుమించుగా మధ్యాహ్నం రెండు గంటల వరకు కౌంటింగ్ పూర్తౌతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.చ‌శుక్రవారం ఉదయం జరగబోయే కౌంటింగ్ కు మినీ స్టేడియం గ్రౌండ్లో కోనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రానికి రెండువందల మీటర్ల దూరం వరకు పోలీసులు నిషేధాజ్ఞలు ఉంటాయని.. అందుకు మూడు అంచెల‌ వ్యవస్థలో కట్టెదిట్టంగా భ‌ద్ర‌త ఉంటుందని.. ఎన్నికల అధికారి జారీ చేసిన పాసులు, కౌంటింగ్ హాలు దగ్గర నిర్దేశించిన పరిధిలో పాసులు ఉన్న వాళ్ళని అనుమతిస్తారని.. కౌంటింగ్ దగ్గర వివిధ పార్టీల నాయకులకు కౌంటింగ్ పాసులు చూసి కౌంటింగ్ హాల్లోకి ప్రవేశం ఉంటుంద న్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్తలతో పోలీసు బందోబస్తు ఉంటుందని ఎన్నికల అధికారి తెలిపారు.

Next Story