పాలమూరులో భారీ వ‌ర్షం.. నేల‌కొరిగిన వృక్షం

by Ratna Kumari |

దిశ-మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. బుధ‌వారం సాయంత్రం కురిసిన వ‌ర్షం ప్ర‌జలను అతలాకుతలం చేసింది.

పాలమూరులో భారీ వ‌ర్షం.. నేల‌కొరిగిన వృక్షం
X

దిశ-మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. బుధ‌వారం సాయంత్రం కురిసిన వ‌ర్షం ప్ర‌జలను అతలాకుతలం చేసింది. సాయంత్రం 5 గంటల నుంచి ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో భారి వర్షం కురవడంతో రోడ్లు అన్ని జలమయం అయ్యాయి. ప్ర‌జ‌లు ఎక్క‌డ పిడుతు ప‌డుతుందోన‌ని భ‌య‌బ్రాంతుల‌కు గుర‌య్యారు. సాయంత్రం పాఠశాల నుంచి విద్యార్థులు ,ఉద్యోగులు ఇళ్లలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారి వర్షం కారణంగా చెట్లు నేలకోరిగాయి. గత నాలుగు గంటలుగా ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమ‌య్యాయి. వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల‌కు గురయ్యారు.

Next Story