- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లమల్లలో భారీ వర్షం..
by Taduka Kalyani |
నాగర్ కర్నూల్ జిల్లాలో గత నాలుగు రోజుల నుండి అకాల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

X
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలో గత నాలుగు రోజుల నుండి అకాల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, లింగాల, పదరా, అచ్చంపేట, ఉప్పునుంతల తదితర మండలాల పరిధిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
మంగళవారం మధ్యాహ్నం మరోసారి అమ్రాబాద్ మండలంలో భారీ వర్షం కురవడంతో తుర్కపల్లి, మన్ననూర్ తదితర గ్రామాలలో వాగులు, వంకలు పారుతున్నాయి. వేసవి కాలంలో గత దశాబ్దం క్రితం కురిసిన వర్షాలు తిరిగి మరలా కురుస్తున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. వానాకాలం సీజన్ రాకముందే భారీ వర్షాలు కురుస్తుండడంతో అసలైన సీజన్ లో వర్షాలు కురుస్తాయో అని రైతులు చర్చించుకుంటున్నారు.
Next Story






