- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దంచి కొట్టిన వాన.. రహదారులన్నీ జలమయం
దిశ, కందనూల్ : ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని రహదారులు, ఇండ్లు, వీధులన్నీ జలమయమయ్యాయి. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో

దిశ, కందనూల్ : ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని రహదారులు, ఇండ్లు, వీధులన్నీ జలమయమయ్యాయి. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు వెళ్లేందుకు దారి లేక రహదారులన్నీ జలమయమవుతున్నాయి. నాగర్ కర్నూల్ బస్టాండు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తా, రామ్ నగర్ కాలనీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ప్రాంతాలతో పాటు ఆయా కాలనీల్లో వర్షానికి ఇండ్లలోకి, షాపుల్లోకి వరద నీరు చేరుకుని ప్రజల అవస్థలు పడ్డారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రహదారిపై వరద నీరు చేరి వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక్కడ పలుమార్లు కాలువలు మరమ్మతులు చేసిన సమస్య పరిష్కారం కాలేదు. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సమీపంలో కేసరి సముద్రం చెరువుకు వెళ్లే వరద నీటి నాలాలు కుంచించుకుపోవడంతో ప్రధాన రహదారిపై వరద నీరు చేరడం నిత్య కృత్యమైంది. ఇప్పటికే పలుమార్లు కాలువలు మరమ్మత్తు చేయగా సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవలే కొత్తగా బ్రిడ్జి కూడా నిర్మాణం పూర్తిచేసినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారి జలమయం కాగా సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ లు వీధులు జలమయమయ్యాయి. షాపుల ముందు నిలిచిన వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. షాపుల్లోకి కూడా నీరు చేరింది. ఉయ్యాలవాడ వైపు కూడా జలమయం కావడంతో ఇక్కడ ఇరుకుగా ఉన్న రహదారిలో మెడికల్ కళాశాల వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.






