- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Krishna Floods : కృష్ణా నదికి భారీ వరద... ఈరోజు సాయంత్రం జూరాల గేట్లు ఎత్తివేత
అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడన(LPA) ప్రభావంతో కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడన(LPA) ప్రభావంతో కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కృష్ణానది(Krishna River)కి భారీ వరద(Floods) వస్తోంది. కృష్ణా నది ఉపనదులకు కూడా మునుపెన్నడూ లేనంత వరద వస్తుండటంతో అదంతా వచ్చి కృష్ణాలో కలుస్తోంది. వరద ప్రవాహం అత్యధికంగా పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా తెలుస్తోంది. అయితే ఈ భారీ వర్షాలు, వరదతో కృష్ణానదిపై గల ప్రాజెక్టుల్లోకి వరద నీటి ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. దీంతో మహబూబ్ నగర్లో ఉన్న జూరాల ప్రాజెక్టుకు(Jurala Project) నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో.. గురువారం సాయంత్రం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 40 వేల క్యూసెక్కులు ఉందని, రేపటి నుంచి ఆది లక్ష క్యూసెక్కులకు చేరుకుంటుందని పేర్కొన్నారు. కావున నదీ పరీవాహక, దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.






