- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ ఇయర్ డ్రంకన్ డ్రైవ్ లో భారీగా దొరికిన మందుబాబులు : ఎస్పీ జానకి
దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో గురువారం రాత్రి నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీ లలో 86 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ఎస్పీ జానకి తెలిపారు.

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో గురువారం రాత్రి నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీ లలో 86 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ఎస్పీ జానకి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం అర్ధరాత్రి ఆమె పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను పరిశీలించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయని, అది చట్ట విరుద్ధమని కూడా అనేక సార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మందుబాబుల్లో మార్పు రావడంలేదని ఆమె వాపోయారు. పట్టుబడ్డ వారిని కోర్టులో హాజరుపరచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ భద్రత నియమాలతో ప్రయాణించాలని ఎస్పీ జానకి పేర్కొన్నారు.ఈ తనిఖీల్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సీఐ భగవంత్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






